‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్ బాబాయ్‌గా! | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్ బాబాయ్‌గా!

Published Wed, May 1 2019 4:16 PM

RRR Movie Latest Intresting Update - Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషల నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ సముద్రఖని పాత్రకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సముద్రఖని.. ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా కనిపించనున్నాడట. కొమరం భీంలో స్వాతంత్రకాంక్షను రగిల్చిన కీలక పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుం‍డగా, ఎన్టీఆర్‌ కు జోడిని ఫైనల్‌ చేయాల్సి ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement