బానిసల ధైర్యం కూడా పరాకాష్టకి.. | RGV Bhairava Geetha Telugu Motion Teaser Out | Sakshi
Sakshi News home page

Jun 21 2018 4:55 PM | Updated on Jun 21 2018 5:16 PM

RGV Bhairava Geetha Telugu Motion Teaser Out - Sakshi

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో మరో చిత్రం ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. భైరవ గీత పేరుతో కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం రూపొందబోతోంది. సిద్ధార్థ అనే డెబ్యూ దర్శకుడ్ని వర్మ పరిచయం చేయబోతున్నాడు. ధనంజయ అలియాస్‌ దాలి అనే కన్నడ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కాసేపటి క్రితం వదిలారు. 

తొలుత లవ్‌  స్టోరీ అంటూ చూపించినప్పటికీ ఆ తర్వాత.. ‘దొరల పొగరు పరాకాష్టకి చేరినప్పుడు బానిసల ధైర్యం కూడా పరాకాష్టకి చేరుతుంది’ అంటూ ఓ ట్యాగ్‌ లైన్‌ చూపించాడు. వర్మ దర్శకుడు కాకపోయినా ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఇదో వయొలెంట్‌ యాక్షన్‌ చిత్రమని వర్మ తేల్చేశారు కూడా. ఆర్జీవీతోపాటు భాస్కర్‌ రాశి భైరవ గీతాన్నినిర్మిస్తుండగా, రిలీజ్‌ తేదీని  త్వరలో ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement