పాప్‌ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల | Raviteja Sreenu Vaitla Shooting At Jennifer Lopez Mansion | Sakshi
Sakshi News home page

Apr 4 2018 10:57 AM | Updated on Apr 4 2018 11:03 AM

Raviteja Sreenu Vaitla Shooting At Jennifer Lopez Mansion - Sakshi

జెన్నిఫర్‌ లోపేజ్‌ నివాసం దగ్గర శ్రీనువైట్ల

కొంతకాలంగా సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమర్‌ అక్బర్‌ ఆంటోని అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ అమెరికాలోని పాప్‌ స్టార్ జెన్నిఫర్‌ లోపేజ్‌కు చెందిన నివాసంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ‘ఆమెకు వీరాభిమానిని. లక్షల మంది అభిమాన పాప్‌ గాయని. పాప్ రాణి. ప్రస్తుతం ఆమె నివాసంలో షూటింగ్ చేస్తున్నాం. కల నిజమైంది’ అంటూ ట్వీట్ చేశారు శ్రీనువైట్ల.

గతంలో రవితేజ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిన వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అమర్‌ అక్బర్‌ ఆంటోనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం జెన్నీపర్‌ లోపేజ్‌ విల్లాలో జరిగే చిత్రీకరణ కోసం భారీ మొత్తాన్ని కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ కథానాయికగా నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement