నేల టిక్కెట్టు... నంబర్‌ 420 | Ravi Teja's Nela Ticket first look released | Sakshi
Sakshi News home page

నేల టిక్కెట్టు... నంబర్‌ 420

Mar 18 2018 12:56 AM | Updated on Mar 18 2018 12:56 AM

Ravi Teja's Nela Ticket first look released - Sakshi

రవితేజ

క్లాసు.. మాసు...ఆడియన్స్‌ ఎవరైనా రవితేజ సినిమాకు రెడీనే బాసూ! నేల, కుర్చీ, బెంచ్, బాల్కనీ ఇలా వరస పెట్టి టిక్కెట్లు తెగాల్సిందే. థియేటర్స్‌లో ఎంటర్‌టైన్మెంట్‌ డబుల్‌.. ట్రిపుల్‌ అవ్వాల్సిందే. రవితేజ హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమాకు ‘నేల టిక్కెట్టు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక. తెలుగువారి తొలి పండగ ఉగాది సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరి సినిమాలో ఆల్‌ ఎమోషన్స్‌ గ్యారంటీ. ఏడాది పిల్లల నుంచి అందరూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూసి ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ అవుతారని చిత్రబృందం చెబుతోంది. కానీ ఫస్ట్‌ లుక్‌లో టిక్కెట్‌ ఖరీదు పది రూపాయాలు అని ఉంది. టిక్కెట్‌ నంబర్‌ ఏమో 420 అని ఉంది. మరి.. ఈ 420 బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలియాలంటే ఆడియన్స్‌ థియేటర్స్‌కి వెళ్లాల్సిందే. ఆల్మోస్ట్‌ 60 శాతం చిత్రీకరణ పూరై్తంది. ఈ చిత్రాన్ని మే 24న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement