‘నింగి మెరుపులా దూకుతాడు వీడు’ | Ravi teja Touch Chesi chudu title song | Sakshi
Sakshi News home page

Jan 22 2018 10:36 AM | Updated on Jan 22 2018 1:01 PM

Ravi teja Touch Chesi chudu title song - Sakshi

రాజా ది గ్రేట్‌ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ, మరోసారి తన ఎనర్జీకి తగ్గ పాత్రలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టచ్ చేసి చూడు సినిమాలో సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు రవితేజ. రాశీఖన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్‌ డి మ్యూస్‌ సంగీతమందించగా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్ శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement