సోగ్గాడిగా మాస్ మహరాజ్..? | Ravi teja in soggade Chinni nayana Sequal | Sakshi
Sakshi News home page

సోగ్గాడిగా మాస్ మహరాజ్..?

Oct 20 2017 12:50 PM | Updated on Oct 20 2017 12:50 PM

Raviteja

దాదాపు రెండేళ్ల విరామం తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు. అంధుడిగా కనిపిస్తూనే తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా రవితేజ తీసుకున్న జాగ్రత్తలు మంచి విజయాన్ని అందించాయి. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు ఈ మాస్ హీరో. ఇప్పటికే టచ్ చేసి చూడు సినిమాను పూర్తి చేసే  పనిలో ఉన్న రవితేజ,  పలువురు దర్శకులతోజరుపుతున్నాడు.

రవితేజ రవితేజ నెక్ట్స్ సినిమాల లిస్ట్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరిందన్న ప్రచారం జరుగుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడి మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు పేరుతో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా తెరకెక్కించాలని భావించాడు.

అయితే ప్రస్తుతం నాగ్ ప్రాజెక్ట్ చేసేందుకు సుముఖంగా లేకపోవటంతో అదే కథను కొద్దిపాటి మార్పులతో రవితేజ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్తలు ఫిలిం నగర్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement