
రొటీన్ సినిమాలు ఇష్టపడే వారు మా సినిమాకు రావొద్దంటూ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పి మరీ రిలీజ్ చేసిన మూవీ ఆర్‌ఎక్స్ 100. దానికి తగ్గట్టే ఈ సినిమా చాలా బోల్డ్‌గా ఉందనీ, మరీ డోస్ ఎక్కువైందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
కానీ యూత్‌ను మాత్రం ఈ సినిమా ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు ఈ మూవీకే హైలెట్. అయితే ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు అనే సంగతి తెలిసిందే. మంచి టాక్, వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ మూవీపై ఆర్జీవి స్పందిస్తూ.. ‘ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తోన్న దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్‌కు కంగ్రాట్స్.. సినిమా సూపర్ ఓపెనింగ్స్‌తో పాటు సక్సెస్ సాధించినందుకు కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు.