‘కాలా’ శాటిలైట్‌ రైట్స్‌కు భారీ ప్రైజ్‌ | Rajinikanth Kaala Movie Satellite Rights | Sakshi
Sakshi News home page

Apr 26 2018 4:14 PM | Updated on Apr 26 2018 4:14 PM

Rajinikanth Kaala Movie Satellite Rights - Sakshi

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తమిళనాట సినీరంగం సమ్మె కారణంగా కాలా సినిమాను జూన్‌ 7కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అధికారిక సమాచారం లేకపోయినా.. కాలా సినిమా శాటిలైట్‌ హక్కులను స్టార్‌ గ్రూప్‌ సంస్థ 75 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్‌ గా నటిస్తుండటంతో ఉత్తరాదిలో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. రజనీ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement