యంగ్ హీరో సినిమాకు రెహమాన్ మ్యూజిక్ | Rahman to Compose Music for Sivakarthikeyan next | Sakshi
Sakshi News home page

Jan 9 2018 10:27 AM | Updated on Jan 9 2018 10:27 AM

Rahman to Compose Music for Sivakarthikeyan next - Sakshi

తమిళ సినిమా: నటుడు శివకార్తికేయన్‌తో సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ చేతులు కలపనున్నారా? దీనికి అవుననే బదులే వస్తోంది. రజనీమురుగన్, రెమో, వేలైక్కారన్‌ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తి కేయన్‌. మోహన్‌రాజా దర్శకత్వంలో తాజాగా నటించిన వేలైక్కారన్‌ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. రెమో చిత్రంలో అందమైన అమ్మాయిగా అలరించి న శివకార్తికేయన్‌ వేలైక్కారన్‌(పనివాడు)లో తన పనితనాన్ని చాటుకున్నారు. 

తాజాగా పొన్‌రా మ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో నటి సమంత కథానాయకిగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం శివకార్తీకేయన్‌కు 12వ చిత్రం. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. 24ఏఎం.స్టూడియోస్‌ సంస్థ అధినేత ఆర్‌డీ.రాజా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. 

ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ కథా చిత్రంగా తెరకెక్కనుందట. దీనికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత భాణీలను అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో తన అభిమానులకు వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. శివకార్తికేయన్‌ ఈ చిత్రంతో తొలిసారిగా ఏఆర్‌.రెహ్మాన్‌తో కలిసి పని చేయనున్నారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement