అంతా బాగానే ఉంది

Radhika Apte Has to Say About Her Hospital Visit Amid Coronavirus Scare - Sakshi

‘జాగ్రత్త మేడమ్‌. జాగ్రత్తలు పాటించండి’ అంటూ రాధికా ఆప్టే అభిమానులు ట్వీటర్‌ ద్వారా ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. అసలు విషయం ఏంటంటే... తన తాజా సినిమా చిత్రీకరణ నిలిచిపోవడంతో లండన్‌లో ఉంటున్న భర్త బెనెడిక్ట్‌తో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి వెళ్లారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫొటో చర్చకు దారి తీసింది. ముఖానికి మాస్క్‌ ధరించి ఆస్పత్రిలో వేచి చూస్తున్న తన ఫొటోని పోస్ట్‌ చేసి, ‘‘ఆస్పత్రికి వచ్చాను.. అయితే భయపడాల్సిందేమీ లేదు. కోవిడ్‌ 19 గురించి కాదులెండి. అంతా బాగానే ఉంది’’ అని పేర్కొన్నారు. కరోనా గురించి కాకపోయినా ఆస్పత్రికి వెళ్లారు కాబట్టి వేరే ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి ఉంటుందని ఫాలోయర్స్‌ ఆమెకు జాగ్రత్తలు చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top