రాశీ... రాకింగ్‌ స్టెప్స్‌!

రాశీ... రాకింగ్‌ స్టెప్స్‌!


రాశీ ఖన్నా ఫస్ట్‌ టైమ్‌ ఓ సాంగ్‌ షూట్‌కి రెడీ అయ్యారు. అదేంటీ! ఇప్పటికే ఆమె చాలా సాంగ్స్‌ చేశారు కదా.. ఫస్ట్‌ టైమ్‌ సాంగ్‌ చేయడమేంటి? అనుకుంటున్నారా? అవన్నీ హీరోయిన్‌గా చేశారు. ఇప్పుడు తాను హీరోయిన్‌ కాని ఓ సినిమాలో కాలు కదపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రవితేజ, మెహరీన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌ ’. ఈ చిత్రంలో రవితేజ, మెహరీన్‌ కాంబినేషన్‌లో వచ్చే ఓ పాటలో రాశీ ఖన్నా తళుక్కుమంటారు.



ఆ పాటలో కాసేపు కనిపించి, అలరించనున్నారు. స్పెషల్‌ అప్పియరన్స్‌ అన్నమాట. రెండేళ్ల క్రితం ‘మనం’ సినిమాలో రాశీ గెస్ట్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ, సాంగ్‌లో స్పెషల్‌ అప్పియరన్స్‌ ఇవ్వడం ఇదే తొలిసారి. ‘‘ మై లవ్లీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కోసం ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో షార్ట్‌ అండ్‌ స్పెషల్‌ అప్పియరన్స్‌లో కనిపించబోతున్నా’’ అని రాశీ ట్వీట్‌ చేశారు. వెంటనే ‘‘వెల్‌కమ్‌ టు అవర్‌ వరల్డ్‌’’ అని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ఈ సాంగ్‌లో రాకింగ్‌ స్టెప్స్‌లో రాశీ కనువిందు చేయనున్నారట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top