పూరి టూరింగ్ టాకీస్‌లో హార్ట్ ఎటాక్ | Puri's 'Touring Talkies' Connection | Sakshi
Sakshi News home page

పూరి టూరింగ్ టాకీస్‌లో హార్ట్ ఎటాక్

Aug 19 2013 1:33 AM | Updated on Sep 1 2017 9:54 PM

పూరి టూరింగ్ టాకీస్‌లో హార్ట్ ఎటాక్

పూరి టూరింగ్ టాకీస్‌లో హార్ట్ ఎటాక్

చిన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనలు, వాడిన వస్తువులు, మంచి అనుభూతి ఇచ్చిన ప్రదేశాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలా పూరి జగన్నాథ్‌కి గుర్తున్న వాటిలో ఓ థియేటర్ ఉంది.

చిన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనలు, వాడిన వస్తువులు, మంచి అనుభూతి ఇచ్చిన ప్రదేశాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలా పూరి జగన్నాథ్‌కి గుర్తున్న వాటిలో ఓ థియేటర్ ఉంది. దాని పేరు ‘టూరింగ్ టాకీస్’. పూరి చిన్నప్పుడు వాళ్లకున్న సొంత థియేటర్ ఇది. 
 
 అందులో సినిమాలు చూసేవాణ్ణని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆల్రెడీ తనకు వైష్ణో ఫిలిం అకాడమీ బేనర్ ఉన్నప్పటికీ, ఇప్పుడు టూరింగ్ టాకీస్ పేరు మీద మరో బేనర్ ప్రారంభించారు పూరి జగన్నాథ్. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా స్వీయదర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 
 
 నితిన్, అదాశర్మ జంటగా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఇందులో నితిన్ కొత్త లుక్‌లో కనిపిస్తారట. దానికోసం ఇటీవల డిజైనర్ నీరజ కోన ఆధ్వర్యంలో కాస్ట్యూమ్స్ ట్రైల్ కూడా జరిగిందని సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement