దర్శకుడిగా మారుతున్న నిర్మాత | pelli chupoolu producer Raj Kandhukuri to turn director | Sakshi
Sakshi News home page

దర్శకుడిగా మారుతున్న నిర్మాత

Oct 9 2016 11:12 AM | Updated on Sep 4 2017 4:48 PM

దర్శకుడిగా మారుతున్న నిర్మాత

దర్శకుడిగా మారుతున్న నిర్మాత

ఈ ఏడాదిలో చిన్న సినిమాగా విడుదలైన ఘనవిజయం సాధించిన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకుడు. రాజ్ కందుకూరి...

ఈ ఏడాదిలో చిన్న సినిమాగా విడుదలైన ఘనవిజయం సాధించిన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకుడు. రాజ్ కందుకూరి నిర్మాతగా కేవలం 80 లక్షల బడ్జెట్ నిర్మించిన ఈ సినిమా, ఏకంగా 20 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రాజ్ కందుకూరి వరుసగా మూడు సినిమాలను ప్రకటించారు. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా, విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుణ్ని పరిచయం చేస్తూ మరో సినిమాతో పాటు తానే స్వయంగా దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. ఓ స్టార్ హీరోతో తన దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించిన రాజ్ కందుకూరి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement