తమ్ముడూ... మీరే చెప్పాలి! | Paisa Vasool teaser out: Nandamuri Balakrishnas film is 100 per cent Mass | Sakshi
Sakshi News home page

తమ్ముడూ... మీరే చెప్పాలి!

Jul 30 2017 11:41 PM | Updated on Aug 29 2018 1:59 PM

తమ్ముడూ... మీరే చెప్పాలి! - Sakshi

తమ్ముడూ... మీరే చెప్పాలి!

‘‘తమ్ముడూ... నేను ‘జంగిల్‌ బుక్‌’ సినిమా చూడలేదు.

‘‘తమ్ముడూ... నేను ‘జంగిల్‌ బుక్‌’ సినిమా చూడలేదు. కానీ, అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో? కాదో? మీరే చెప్పాలి’’ అంటున్నారు బాలకృష్ణ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘పైసా వసూల్‌’లో డైలాగ్‌ ఇది. నిజమో.. కాదో.. చెప్పాలంటే ముందు పులిని చూడాలి కదా! మరి, పులిని ఎప్పుడు చూపిస్తారు? అంటే... ‘సెప్టెంబర్‌ 1న’ అన్నారు నిర్మాత వి. ఆనందప్రసాద్‌.

భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆయన నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ వర్క్స్‌ పూర్తయ్యాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ తుది దశకు చేరుకున్నాయి. త్వరలో అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటల్ని, సెప్టెంబర్‌ 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ‘‘ఇందులో కొత్త బాలకృష్ణను చూస్తారు.

ఇటీవల విడుదలైన స్టంపర్‌కు, అందులో బాలకృష్ణగారి డైలాగులకు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమా కూడా స్టంపర్‌ తరహాలో ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు పూరి. శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కబీర్‌ బేడి, అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్‌ కీలక పాత్రధారులు.

Advertisement
 
Advertisement
Advertisement