బస్సులో... లవ్.. కామెడీ | On the bus, ... .. Comedy Love | Sakshi
Sakshi News home page

బస్సులో... లవ్.. కామెడీ

Feb 3 2016 12:11 AM | Updated on Sep 3 2017 4:49 PM

బస్సులో... లవ్.. కామెడీ

బస్సులో... లవ్.. కామెడీ

యువకుని జీవితం చుట్టూ సాగే కథాంశంతో లవ్, కామెడీ, మిస్టరీ సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘రైట్...రైట్’. కథానాయకుడు అశ్విన్ ఆర్టీసీ బస్ కండక్టర్‌గా రైట్...రైట్ అంటున్నారు.

 అతనో కండక్టర్. ఎస్ కోట నుంచి గవిటికి వెళ్లే బస్సే అతనికి  జీవనాధారం. రొటీన్‌గా సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ యువకుని జీవితం చుట్టూ సాగే కథాంశంతో లవ్, కామెడీ, మిస్టరీ సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘రైట్...రైట్’. కథానాయకుడు  అశ్విన్ ఆర్టీసీ బస్ కండక్టర్‌గా రైట్...రైట్ అంటున్నారు.

శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా ఝవేరి నాయిక. ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రధారి. నిర్మాత మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో ఆర్టీసీ బస్సు కీలకం. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈ నెల 20  నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసఫ్, సహ-నిర్మాత: జె.శ్రీనివాసరాజు.

Advertisement
 
Advertisement
Advertisement