విజయ్ సేతుపతితో మెగా డాటర్ | Niharika tamil debut | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతితో మెగా డాటర్

Feb 16 2017 3:07 PM | Updated on Sep 5 2017 3:53 AM

విజయ్ సేతుపతితో మెగా డాటర్

విజయ్ సేతుపతితో మెగా డాటర్

యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ గానూ అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగా వారసురాలు నిహారిక. మెగా

యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ గానూ అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగా వారసురాలు నిహారిక. మెగా అభిమానులకు షాక్ ఇస్తూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక, తొలి సినిమా ఒక్క మనసుతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నా సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. దీంతో తన రెండో సినిమా ఎంపికకు చాలా సమయం తీసుకుంది. టాలీవుడ్లో హీరోయిన్గా నటించేందుకు మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన మెగా డాటర్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.

కోలీవుడ్లో మంచి విజయాలు సాధిస్తున్న విజయ్ సేతుపతి సరసన నిహారిక హీరోయిన్గా నటించనుంది. అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కడలి ఫేం గౌతమ్ కార్తీక్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు 'నాన్నకూచి' అనే వెబ్ సీరీస్లో తండ్రి నాగబాబుతో కలిసి నటిస్తోంది నిహారిక. మరి కోలీవుడ్లో అయిన నిహారికకు, హీరోయిన్గా సక్సెస్ వస్తుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement