కోటీశ్వరుడు ఎవరు? | Naveen Chandra's next titled Meelo Evaru Koteeswarudu | Sakshi
Sakshi News home page

కోటీశ్వరుడు ఎవరు?

Sep 15 2016 11:17 PM | Updated on Sep 4 2017 1:37 PM

కోటీశ్వరుడు ఎవరు?

కోటీశ్వరుడు ఎవరు?

నవీన్‌చంద్ర హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్ నిర్ణయించారు.

 నవీన్‌చంద్ర హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాత. శ్రుతీ సోధి కథానాయిక. కేకే రాధామోహన్ మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్‌లో వస్తోన్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది.
 
 రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఓ పాటను ఈ నెలలో అరకులో చిత్రీకరించనున్నాం’’అని తెలిపారు. ‘‘గతంలో నా దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలు ఉంటాయి’’ అని సత్తిబాబు తెలిపారు. పృధ్వీ, సలోని, జయప్రకాష్ రెడ్డి, పోసాని, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: బాల్‌రెడ్డి పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎంఎస్. కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్.
 

Advertisement
 
Advertisement
Advertisement