ట్విన్స్... టైమింగ్! | Naveen Chandra, priyal Gore's movie Chandamama rave | Sakshi
Sakshi News home page

ట్విన్స్... టైమింగ్!

Nov 17 2016 11:20 PM | Updated on Sep 4 2017 8:22 PM

ట్విన్స్... టైమింగ్!

ట్విన్స్... టైమింగ్!

తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి కవల సోదరులు ధర్మ-రక్ష దర్శకత్వం వహించిన చిత్రం ‘చందమామ రావే’.

తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి కవల సోదరులు ధర్మ-రక్ష దర్శకత్వం వహించిన చిత్రం ‘చందమామ రావే’. నవీన్ చంద్ర, ప్రియల్ గోర్ హీరో, హీరోయిన్లు. కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ‘‘ప్రేమకు, జీవితానికి టైమింగ్ అవసరమని చెప్పే చిత్రమిది.

వైవిధ్య కథాంశం. వినోదం, ఎమోషన్స్ ఉంటాయి. ప్రపంచంలోనే ట్విన్స్ డెరైక్ట్ చేసిన చిత్రం మాదే. నవీన్ చంద్ర పాత్ర కొత్తగా ఉంటుంది. త్వరలో పాటలు, సినిమా రిలీజవుతాయి’’ అని నిర్మాతలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement