భిన్నమైన కథతో... | naveen chandra next movie directing twins | Sakshi
Sakshi News home page

భిన్నమైన కథతో...

Aug 4 2016 11:17 PM | Updated on Sep 4 2017 7:50 AM

భిన్నమైన కథతో...

భిన్నమైన కథతో...

సినిమా అనే షిప్‌కి డెరైక్టర్ కెప్టెన్‌లాంటి వాడు. సాధారణంగా ఓ చిత్రానికి ఒకే దర్శకుడుంటాడు. అరుదైన పరిస్థితుల్లో ఇద్దరు వేర్వేరు దర్శకులు పనిచేసిన సందర్భాలున్నాయి.

సినిమా అనే షిప్‌కి డెరైక్టర్ కెప్టెన్‌లాంటి వాడు. సాధారణంగా ఓ చిత్రానికి ఒకే దర్శకుడుంటాడు. అరుదైన పరిస్థితుల్లో ఇద్దరు వేర్వేరు దర్శకులు పనిచేసిన సందర్భాలు న్నాయి. కానీ, తొలిసారి కవల సోదరులు ధర్మ-రక్ష దర్శకత్వం వహించిన చిత్రం ‘చందమామ రావే’. నవీన్ చంద్ర, ప్రియల్ గోర్ హీరో హీరోయిన్లు. ఐఈఎఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల నిర్మించారు.

ఈ చిత్రం బ్యానర్ లోగోను దర్శకుడు మారుతి, టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలం. కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి’’ అని దర్శకులు తెలిపారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. చిత్ర నిర్మాతలు, హీరో నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement