జూన్ నెలాఖరున 'చందమామ రావే' | Naveen Chandra Chandamama rave release on june | Sakshi
Sakshi News home page

జూన్ నెలాఖరున 'చందమామ రావే'

May 27 2017 1:22 PM | Updated on Sep 5 2017 12:09 PM

జూన్ నెలాఖరున 'చందమామ రావే'

జూన్ నెలాఖరున 'చందమామ రావే'

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన న‌వీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా'చందమామ రావే'.

అందాల రాక్షసి  చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన న‌వీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా'చందమామ రావే'. ఈ సినిమాతో ప్రియ‌ల్ గోర్ అనే హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. 'అది రాదు.. వీడు మార‌డు' అనేది క్యాప్షన్.  లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ర‌క్తచ‌రిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వ‌ర్మ స‌హా ప‌లువురు స్టార్ డైరెక్టర్స్ వ‌ద్ద ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన క‌వ‌ల ద‌ర్శకులు ధ‌ర్మ‌-ర‌క్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత కిర‌ణ్ జ‌క్కంశెట్టి మాట్లాడుతూ... 'ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ దగ్గర ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ధ‌ర్మ‌, ర‌క్షలు చందమామ రావేకు దర్శకత్వం వహించారు.. నిర్మాణాంత‌ర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. పెక్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ. ల‌వ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పేఎక్స్‌ట్రీమ్ ల‌వ్‌స్టోరీ 'చంద‌మామ రావే'. ఆద్యంతం అలరించే చిత్రంగా రూపొందిన 'చందమామ రావే'ను జూన్ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement