మరో చారిత్రక పాత్రలో నాగార్జున | Nagarjuna To Play Baba Hathi Ram in Raghavendra Rao Direction | Sakshi
Sakshi News home page

మరో చారిత్రక పాత్రలో నాగార్జున

Jan 21 2016 2:26 PM | Updated on Jul 15 2019 9:21 PM

మరో చారిత్రక పాత్రలో నాగార్జున - Sakshi

మరో చారిత్రక పాత్రలో నాగార్జున

సీనియర్ హీరోలలో తన వయసుకు, ఇమేజ్కు తగ్గ పాత్రలను ఎంచుకోవటంలో ముందున్న హీరో కింగ్ నాగార్జున. మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన నాగ్...

సీనియర్ హీరోలలో తన వయసుకు, ఇమేజ్కు తగ్గ పాత్రలను ఎంచుకోవటంలో ముందున్న హీరో కింగ్ నాగార్జున. మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన నాగ్ మరోసారి భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నాగార్జున త్వరలో వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు 'హాథీరాం బాబా'గా కనిపించనున్నాడు.

శిరిడి సాయి సినిమా తరువాత ఇంతవరకు దర్శకుడు రాఘవేంద్రరావు మరో సినిమాను ప్రారంభించలేదు. వెంకటేశ్వర స్వామి కథతో ఓ సినిమా చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించినా, నాగార్జున డేట్స్ కాళీ లేకపోవటంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. సోగ్గాడే చిన్నినాయనా  తరువాత మరో సినిమా అంగీకరించని నాగ్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement