బంగార్రాజు నాగార్జునే | Nagarjuna new film is Bangarraju | Sakshi
Sakshi News home page

బంగార్రాజు నాగార్జునే

Oct 24 2017 12:28 AM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna new film is Bangarraju - Sakshi

బంగార్రాజు పేరు వినగానే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ గుర్తుకురాక మానదు. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ బంగార్రాజు పాత్రలో నాగ్‌ పల్లెటూరి సోగ్గాడిగా అలరించారు. ‘సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌గా నాగార్జునతో ‘బంగార్రాజు’ సినిమాకు ప్లాన్‌ చేశారు కల్యాణ్‌ కృష్ణ.

కానీ, ఇప్పుడా సినిమా ప్రస్తావన లేకపోవడంతో నాగ్‌ ఆ సినిమా చేయడం లేదనీ, రవితేజతో ‘బంగార్రాజు’ తీసేందుకు కల్యాణ్‌ రెడీ అవుతున్నారనే వార్త షికారు చేస్తోంది. రవితేజకు కథ కూడా వినిపించారట. ‘‘అసలు ఆ రూమర్‌ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు. ‘బంగార్రాజు’ కథ ఒక వెర్షన్‌ రాశా. అది నాగ్‌సార్‌కి అంతగా నచ్చకపోవడంతో వేరేలా తయారు చేస్తున్నా.

ఇప్పటికీ, ఎప్పటికీ ‘బంగార్రాజు’ నాగార్జున సారే. రవితేజకు నేను కథ చెప్పిన విషయం వాస్తవమే. కానీ, అది వేరే కథ. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని క్లారిటీ ఇచ్చి, రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్‌ సినిమా రూపొందించే పనిలో ఉన్నారు కల్యాణ్‌ కృష్ణ. మరి నాగార్జున, వెంకటేశ్‌–నాగచైతన్య, రవితేజ.. ఎవరి సినిమా ముందు సెట్స్‌పైకి వెళుతుందన్నది సస్పెన్స్‌. వారి డేట్స్‌ని బట్టి ఎవరితో సినిమా ముందు మొదలవుతుందో త్వరలో తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement