అందరి సహకారంతోనే ఈ విజయం | My win is possible with all cooperation says indian idol revanth | Sakshi
Sakshi News home page

అందరి సహకారంతోనే ఈ విజయం

Apr 6 2017 2:35 AM | Updated on Sep 4 2018 5:07 PM

అందరి సహకారంతోనే ఈ విజయం - Sakshi

అందరి సహకారంతోనే ఈ విజయం

ఇండియన్‌ ఐడల్‌ను సొంతం చేసుకున్న తెలుగు గాయకుడు రేవంత్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఇండియన్‌ ఐడల్‌ రేవంత్‌..
విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం

శంషాబాద్‌: ఇండియన్‌ ఐడల్‌ను సొంతం చేసుకున్న తెలుగు గాయకుడు రేవంత్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అభిమానులు, కుటుంబ సభ్యులు, మీడియాతోపాటు శ్రేయోభిలాషులందరి సహకారంతోనే తాను ఇండియన్‌ ఐడల్‌ను సొంతం చేసుకోగలిగానని అన్నారు. ఆయా వేదికలపై తాను ఆలపించిన ఎన్నో మధురమైన గీతాలు గొప్ప అనుభూతిని మిగిల్చాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement