ఆన్‌లైన్‌ గురుకుల్‌! | msg Online Gurukul movie poster release | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గురుకుల్‌!

Aug 19 2017 12:38 AM | Updated on Sep 17 2017 5:40 PM

ఆన్‌లైన్‌ గురుకుల్‌!

ఆన్‌లైన్‌ గురుకుల్‌!

యమ్‌.యస్‌.జి. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్, ఆయన కూతురు హానీ ప్రీత్‌ ఇన్సాన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న చిత్రం ‘యమ్‌.యస్‌.జి. ఆన్‌లైన్‌ గురుకుల్‌’.

యమ్‌.యస్‌.జి. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్, ఆయన కూతురు హానీ ప్రీత్‌ ఇన్సాన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న చిత్రం ‘యమ్‌.యస్‌.జి. ఆన్‌లైన్‌ గురుకుల్‌’. గుర్మీత్‌ 50వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియాలో జరుగుతున్న చెడును నిర్మూలించే ఒక సైబర్‌ పోలీసాఫీసర్‌ పాత్రను ఇందులో పోషిస్తున్నాను. సినిమాల ద్వారా మంచి సందేశం ఇవ్వడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయడం నాకిష్టం. ఇటీవల ఉత్తర భారతదేశంలో రక్తదానం, అవయవదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేసి దక్షిణ భారతదేశంలో కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకున్న భార్యాభర్త లకు ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయం అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement