అమ్మతనం నాకు దేవుడిచ్చిన వరం | motherhood is a bliss, says Aishwarya Rai | Sakshi
Sakshi News home page

అమ్మతనం నాకు దేవుడిచ్చిన వరం

Oct 9 2013 12:40 AM | Updated on Apr 3 2019 6:23 PM

అమ్మతనం నాకు దేవుడిచ్చిన వరం - Sakshi

అమ్మతనం నాకు దేవుడిచ్చిన వరం

‘‘జీవితంలో మార్పు సహజం. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం వ్యక్తిగతంగా బలపడటానికి, మంచి మనిషిగా మారడానికి తోడ్పాటునిస్తాయి’’ అని ఐశ్వర్యారాయ్ అన్నారు. ఇటీవల ముంబైలో ‘లైఫ్ సెల్’ అనే జీవకణ నిధి (స్టెమ్‌సెల్ బ్యాంకింగ్)ని ప్రారంభించారు.

ఈ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ఐష్ తన కుమార్తె ఆరాధ్య జీవకణాలను కూడా స్టెమ్ సెల్‌లో భద్రపరిచారు. ఈ సందర్భంగా ఐష్ మాట్లాడుతూ -‘‘అమ్మతనం నాకు దేవుడిచ్చిన గొప్పవరం. అంతే కాదు గొప్ప జ్ఞాపకం కూడా. ఆరాధ్య నా జీవితంలోకి రావడం గొప్ప అనుభూతి. ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి నాకు పెళ్లికి ముందే తెలుసు. 
 
మిత్రులు, వైద్యుల ద్వారా ఈ వివరాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కుమార్తె జీవకణాలను భద్ర పరచడం చాలా ఆనందంగా ఉంది. స్టెమ్ సెల్ ప్రాముఖ్యత గురించి దేశంలో అన్ని వర్గాల వారూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని పేర్కొన్నారు ఐశ్వర్య.
 
Advertisement
 
Advertisement
Advertisement