మహిళా పోలీసులకే మిగమిగ అవసరం | Migamiga avasaram film is dedicated to women's police | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసులకే మిగమిగ అవసరం

Jul 20 2017 2:33 AM | Updated on Sep 5 2017 4:24 PM

మహిళా పోలీసులకే మిగమిగ అవసరం

మహిళా పోలీసులకే మిగమిగ అవసరం

మిగమిగ అవసరం చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాత సురేశ్‌ కామాక్షి తెలిపారు.

తమిళసినిమా:  మిగమిగ అవసరం చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాత సురేశ్‌ కామాక్షి తెలిపారు. ఇంతకు ముందు అమెదిపడై 2, కంగారు చిత్రాలను నిర్మించిన సురేశ్‌ కామాక్షి మూడవ చిత్రానికి తానే దర్శకుడిగా అవతారమెత్తారు. ఆయన స్వీయ నిర్మిస్తున్న చిత్రానికి మిగ మిగ అవసరం అని పేరు నిర్ణయించారు. శ్రీప్రియాంక నాయకిగా సెంట్రిక్‌ పాత్రను పోషిస్తున్న  ఇందులో హరీశ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.

పోలీస్‌ అధికారిగా ప్రధాన పాత్రలో దర్శకుడు సీమాన్‌ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో లళక్కు ఎన్‌ ముత్తరామన్, సేతుపతి లింగ, పరంజ్యోతి, దర్శకుడు సరవణ శక్తి నటిస్తున్నారు. దర్శకుడు జగన్‌ కథ, కథనాన్ని అందించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ కామాక్ష్మి స్వీయ దర్శకత్వంలో తన వి.హౌస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మిగ మిగ అవసరం చిత్రంలో మహిళా పోలీసుల మనోధైర్యాన్ని, మానవత్వాన్ని, వాటితో పాటు వాళ్ల సమస్యలను అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన ట్లు తెలిపారు. అందువల్ల ఈ చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement