‘సైజ్‌ జీరో’ దర్శకుడి ‘మెంటల్‌ హై క్యా’ | Mental Hai Kya Directed by Prakash Kovelamudi | Sakshi
Sakshi News home page

Mar 6 2018 10:47 AM | Updated on Mar 6 2018 12:50 PM

Mental Hai Kya Directed by Prakash Kovelamudi - Sakshi

రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెంటల్‌ హై క్యా’ పోస్టర్‌

తెలుగులో అనగనగా ఒక ధీరుడు, సైజ్‌ జీరో సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్‌ కోవెలమూడి. దర‍్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రకాష్ కమర్షియల్ సక్సెస్‌ లు సాధించలేకపోయినా.. విభిన్న చిత్రాలతో తన మార్క్‌ చూపిస్తున్నాడు. గతంలో మార్నింగ్‌రాగా అనే జాతీయ స్థాయి చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

విలక్షణ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కీలక పాత్రల్లో మెంటల్‌ హై క్యా.? అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్స్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement