థ్రిల్లర్‌ మేళా | Mela movie shooting started Hyderabad | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌ మేళా

Oct 9 2017 1:34 AM | Updated on Oct 9 2017 1:34 AM

Mela movie shooting started Hyderabad

సూర్యతేజ, ‘కబాలి’ ఫేమ్‌ సాయి ధన్సిక, అలీ, మంజు, సోనీ చరిష్టా ముఖ్య తారలుగా శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో సంతోష్‌ కొంక నిర్మించ నున్న ‘మేళా’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలీ మాట్లాడుతూ– ‘‘సాయి ధన్సిక మంచి నటే కాదు, మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంది.  ఈ సినిమాలో మంచి రోల్‌లో కనిపించనుంది. శ్రీపురం కిరణ్‌ 30 ఏళ్లుగా తెలుసు. నెమ్మదిగా ఎదుగుతూ  దర్శకుడి స్థాయికి చేరుకున్నారు’’ అన్నారు. శ్రీపురం కిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లో నేను చూసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘మేళా’ కథ తయారు చేశా.

ఇన్వెస్టిగేటివ్‌ హారర్‌ థ్రిల్లర్‌ ఇది. ఇలాంటి కథను తెరకెక్కించాలంటే నిర్మాతకి ప్యాషన్‌ ఉండాలి. అలాంటి నిర్మాత సంతోష్‌గారు’’ అన్నారు. ‘‘రెండు నెలలు క్రితం కిరణ్‌గారు కథ చెప్పినప్పుడు నేను థ్రిల్‌ అయ్యాను. నా క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు సాయిధన్సిక. నిర్మాత సంతోష్, సూర్యతేజ, మాగ్నస్‌ మీడియా మహిధర్, మంజు, సోని చరిష్టా, కెమెరామెన్‌ మురళీమెహ రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement