మెగాస్టార్‌ మాస్టర్‌ పీస్‌ ట్రైలర్‌ అదుర్స్‌ | Mammootty Masterpiece trailer Out | Sakshi
Sakshi News home page

Dec 7 2017 10:32 PM | Updated on Dec 7 2017 10:32 PM

Mammootty Masterpiece trailer Out - Sakshi

సాక్షి, సినిమా :  మళయాళ మెగాస్టార్‌ మమ్మూటీ కొత్త చిత్రం మాస్టర్‌ పీస్‌ ట్రైలర్‌ విడుదలైన కాసేపటికే సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ గా మారింది. చాలా కాలం తర్వాత హీరోయిజంను ఎలివేట్‌ చేసే క్యారెక్టర్‌తో ఆయన కనిపిస్తుండటంతో అభిమానులు ట్రైలర్‌ చూసి ఊగిపోతున్నారు.

కాలేజీ ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ లివింగ్‌స్టన్‌ పాత్రలో ఆయన నటిస్తున్నాడు. తన మాట వినకపోతే విద్యార్థుల తాట తీసే లెక్చరర్‌గా కనిపించారు. మరో యంగ్‌ హీరో ఉన్నిముకుందన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, పూనమ్‌ బజ్వా తదితరులు నటించారు. 

అజయ్ వాసుదేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హై యాక్షన్‌  వోల్టేజ్‌ చిత్రం రిలీజ్‌ డేట్‌ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఓవైపు మోహన్‌లాల్‌ ప్రయోగాత్మక చిత్రాలు తీస్తూ ముందుకు సాగుతుంటే మమ్మూటీ మాత్రం ఇలా ఇంకా హీరోయిజం చిత్రాలు తీయటం సరైందేనా? అని కొందరు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ట్రైలర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement