– త్రివిక్రమ్
‘‘దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్లు. సెట్ డైరెక్టర్లు అన్నారు. ఆయనకు తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. సినిమా అంతా అయిపోయి రిలీజ్ తర్వాత ఇది ఇలాకన్నా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాను. అది నేను. సో .. మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు’’ అన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్.
నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను మణిశర్మ ఫ్యాన్‌ని. ఆయన గురించి చెప్పే స్థాయి మనకు లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నాను.
రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, వెంకట్‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్, సెట్ డైరెక్టర్. నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్‌ను. హను సెట్లో సీన్‌ను ఊహించగలడు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనిల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్. ఇప్పుడు వీరికి తోడుగా వెంకట్ వచ్చారు. వారి కోసం సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్ లుక్ బాగుంది’’ అన్నారు.
‘‘ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం వెనక చిత్రబృందం కృషి ఎంతో ఉంది. ఈ సినిమాను నితిన్ నాకన్నా ఎక్కువగా నమ్మాడు’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ (పవన్ కల్యాణ్) గారు ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఆయన సోల్మెట్ త్రివిక్రమ్ వచ్చారు కాబట్టి, ఆయన వచ్చినట్టే. నా కెరీర్లో ఇది 24వ సినిమా. నెక్ట్స్ 25వ సినిమా కల్యాణ్‌గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను చేయబోతున్న ఫస్ట్ సినిమా. అంతకంటే ఒక ఫ్యాన్‌గా నాకేం కావాలి.
అనిల్‌గారు నా స్వీట్ హార్ట్. గోపీగారు, రామ్‌గారు, వెంకట్‌గారు చాలా ప్యాషనెట్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్స్. హనూకి సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీ–రికార్డింగ్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘మూవీ స్టార్ట్ చేసిన రోజునే ఆగస్టు 11న రిలీజ్ అనుకున్నాం. ఇప్పుడు అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.
దర్శకులు మూడు రకాలు!
Published Sun, Aug 6 2017 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement