గోల్డ్‌ ఫిష్‌ కీరవాణి పాట | Keeravani's song has raised 'Operation Gold Fish' to a new high | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఫిష్‌ కీరవాణి పాట

Mar 9 2019 1:08 AM | Updated on Mar 9 2019 1:08 AM

Keeravani's song has raised 'Operation Gold Fish' to a new high - Sakshi

ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, శ్రీచరణ్‌ పాకాల

ఆది సాయికుమార్‌ ఎన్‌.ఎస్‌.జి కమాండోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. శషా చెత్రి, నిత్యా నరేష్‌ కథానాయికలు. రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా ఘాజీ బాబా పాత్రలో నటిస్తున్నారు. సాయికిరణ్‌ అడివి దర్శకుడు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి ఓ దేశభక్తి పాట పాడారు. ‘‘కీలక సన్నివేశంలో వచ్చే కీరవాణిగారు పాడిన పాట సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్లింది. రామజోగయ్య శాస్త్రిగారు విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు సాయికిరణ్‌.

సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. ఈ పాటలోని సందేశం జనాలను ఆలోచింపచేస్తుంది. కీరవాణిగారి సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పైగా ఆ పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా  ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్‌ యాదవ్‌ (వైజాగ్‌), నిర్మాతలు: ప్రతిభ అడివి, కట్టా ఆశిష్‌ రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్‌ డేగల.

Advertisement
 
Advertisement
Advertisement