బర్త్‌డే గిఫ్ట్‌ | Jyothika's birthday treat to her fans this year | Sakshi
Sakshi News home page

బర్త్‌డే గిఫ్ట్‌

Jul 31 2018 2:21 AM | Updated on Jul 31 2018 2:21 AM

Jyothika's birthday treat to her fans this year - Sakshi

జ్యోతిక

అక్టోబర్‌ 18న జ్యోతిక బర్త్‌డే. ఆ రోజు సూర్య ఏం గిఫ్ట్‌ ఇస్తారో చెప్పలేం కానీ, ‘కాట్రిన్‌ మొళి’ టీమ్‌ మాత్రం ఆమెకో గిఫ్ట్‌ ఇవ్వనుంది. ఇటీవలే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా యూనిట్‌ సభ్యులకు పట్టు చీరలు, పట్టు పంచెలు, పట్టు చొక్కాలు బహుకరించారు జ్యోతిక. ఆమె బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ డిసైడ్‌ అయింది.

సో.. ‘కాట్రిన్‌ మొళి’ అక్టోబర్‌ 18న రిలీజ్‌ కానుందన్నమాట. విద్యా బాలన్‌ హిందీ హిట్‌ మూవీ ‘తుమ్హారీ సులు’కి రీమేక్‌ ఇది. జ్యోతికతో పదేళ్ల క్రితం ‘మొళి’ వంటి హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన రాధామోహన్‌ ఈ రీమేక్‌కి దర్శకుడు. ఆల్రెడీ హిందీలో హిట్టయిన చిత్రం కాబట్టి రీమేక్‌ కూడా హిట్‌ కావడం గ్యారంటీ అని ఫిక్స్‌ అవ్వొచ్చు. సినిమా బాగా వస్తోందని యూనిట్‌ అంటోంది. సో.. ఈ చిత్రవిజయం జ్యోతికకు మంచి బర్త్‌డే గిఫ్ట్‌ అవుతుందని చెప్పొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement