స్టార్ట్‌ టు ఎండ్‌.. నాన్‌స్టాప్‌ | Jyothika on Tumhari Sulu remake | Sakshi
Sakshi News home page

స్టార్ట్‌ టు ఎండ్‌.. నాన్‌స్టాప్‌

Jun 1 2018 1:07 AM | Updated on Jun 1 2018 1:07 AM

Jyothika on Tumhari Sulu remake  - Sakshi

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జోరు పెంచారు హీరోయిన్‌ జ్యోతిక. మణిరత్నం రూపొందిస్తున్న ‘చెక్క చివంద వానమ్‌’ చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నారు. అలాగే విద్యా బాలన్‌ నటించిన బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘తుమ్హారీ సులూ’ రీమేక్‌లో కూడా కనిపించనున్నారు జ్యోతిక. ‘కాట్రిన్‌ మొళి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రాధా మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 4న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.  విశేషం ఏంటంటే.. స్టార్టింగ్‌ నుంచి సినిమా ఎండ్‌ వరకూ ఒక్కటే షెడ్యూల్‌లో  షూటింగ్‌ కంప్లీట్‌ చేయనున్నారు. ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాను ధనుంజయన్, లలిత, విక్రమ్‌ కుమార్‌ నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement