పోలీసుల అదుపులో పాప్ సింగర్! | Justin Bieber parties with mystery blonde | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో పాప్ సింగర్!

Feb 2 2014 4:03 PM | Updated on Sep 2 2017 3:17 AM

పోలీసుల అదుపులో పాప్ సింగర్!

పోలీసుల అదుపులో పాప్ సింగర్!

వివాదస్పద పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బీబర్ ప్రయాణించిన ప్రైవేట్ విమానంలో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో కస్టమ్స్ అధికారులు సోదాలు జరిపారు.

వివాదస్పద పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బీబర్ ప్రయాణించిన ప్రైవేట్ విమానంలో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో కస్టమ్స్ అధికారులు సోదాలు జరిపారు. సుమారు ఐదుగంటలకు పైగానే బీబర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే బీబర్ పై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోలీసుల విచారణ అనంతరం మాక్సిమ్ బిగ్ గేమ్ వీకెంట్ పార్టీలో పాల్గొన్నట్టు న్యూయార్క్ డెయిలీ న్యూస్ తన కథనంలో వెల్లడించింది. 
 
21 సంవత్సరాలు నిండని కారణంగా గతంలో జరిగిన మాక్సీమ్ బిగ్ గేమ్ వీకెండ్ పార్టీకి దూరంగా ఉన్నాడు. ఈసారి ఐదు గంటలకు పైగా ఆలస్యంగా అర్ధరాత్రి 1 గంట తర్వాత 15 మంది స్నేహితులతో ఈ పార్టీకి బీబర్ హాజరైనట్టు న్యూయార్క్ డెయిలీ న్యూస్ తెలిపింది. ఉదయం 4 గంటలకు వరకు సాగిన ఈ పార్టీలో పసుపు రంగు జుట్టున్న ఓ అమ్మాయితో పార్టీని ఎంజాయ్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ పార్టీలో బీబర్ మద్యం సేవించలేదని స్నేహితులు వెల్లడించారు. ఈ పార్టీలో అభిమానులు ఆయన్ను కెమెరాలు, ఫోన్లతో తీయడానికి పోటీపడ్డారని.. అయితే బీబర్ ప్రశాంతంగా పోజులిచ్చినట్టు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement