ఆకట్టుకుంటోన్న ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ | Johaar Telugu Movie First Glimpse Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటోన్న ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’

Jan 25 2020 12:29 PM | Updated on Jan 25 2020 12:38 PM

Johaar Telugu Movie First Glimps Released - Sakshi

‘బ్యూటిఫుల్‌’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘దృశ్యం’ ఫేమ్‌ ఎస్తర్‌ అనిల్‌, సీనియర్‌ నటి ఈశ్వరీరావు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘జోహార్‌’. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై భాను సందీప్ మార్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’పేరిట సినిమాకు సంబంధించిన చిన్న వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. రోహిణి, శుభలేఖ సుధాకర్‌, తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ సంగీతమందించాడు.  


 

Advertisement
 
Advertisement
Advertisement