మేము పబ్లిక్‌ సొత్తు కాదు. | Iam A Public Figure, Not Public Property Says Ileana | Sakshi
Sakshi News home page

మేము పబ్లిక్‌ సొత్తు కాదు.

Sep 18 2017 4:13 AM | Updated on Sep 3 2019 8:43 PM

మేము పబ్లిక్‌ సొత్తు కాదు. - Sakshi

మేము పబ్లిక్‌ సొత్తు కాదు.

మేము పబ్లిక్‌ సొత్తు కాదని అంటోంది నటి ఇలియానా.

తమిళసినిమా: మేము పబ్లిక్‌ సొత్తు కాదని అంటోంది నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీ కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చినా హిట్‌ ఖాతాను ప్రారంభించింది మాత్రం టాలీవుడ్‌లోనే. అక్కడ దేవదాసు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఇలియానాకు ఆ చిత్ర విజయం వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం కలిగించలేదు. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో మళ్లీ కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా నన్భన్‌ చిత్రంలో నటించే అవకాశం తలుపుతట్టింది.

అయితే అంతకుముందు పలు ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వచ్చినా ఇలియానా అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. కారణాలేమైనా నన్బన్‌ చిత్రం తరువాత కూడా ఇలియానా కోలీవుడ్‌లో కనిపించలేదు. ఆ తరువాత టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్‌లో తెలింది. ఇప్పటికీ హిందీ చిత్రాలనే నమ్ముకున్న ఇలియానాపై బోలెడన్ని వదంతులు ప్రచారమై అవి సినీ జనాలకు చాలా ఎంటర్‌టెయిన్‌ ఇచ్చాయి. అందులో ఒకటి ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూతో జరుపుతున్న ప్రేమాయణం అంశం.

చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు తన ప్రచారాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు. తమ గ్లామరస్‌ ఫొటోలను అందులో పోస్ట్‌ చేసి అభిమానుల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా నటి ఇలియానా కూడా తన లవర్‌ ఆండ్రూతో రొమాంటిక్‌గా ఉన్న ఫొటోలను ఇన్‌స్ట్ర్రాగాంలో పోస్ట్‌ చేసి ప్రచారం పొందే ప్రయత్నం చేసింది. అయితే అది బెడిసి కొట్టినట్లుంది. ఈ అమ్మడి గురించి వదంతుల పర్వం తీవ్రం అవడంతో తలనొప్పిగా మారిందట. దీంతో వదంతుల రాయుళ్లపై ఇలియానా ఆగ్రహంతో ఊగిపోతోందట. నిజమే హీరోయిన్లు సెలబ్రిటీలే.

అయితే వారేమీ పబ్లిక్‌ సొత్తు కాదు. తామూ మనుషులమే. తమకు పర్సనల్‌ జీవితం అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరూ? స్త్రీలమన్న భావనతో తమకు కాస్త గౌరవం ఇవ్వండి అంటూ చిర్రుబుర్రులాడుతోందట. మరి లవర్‌తో ఉన్న రొమాంటిక్‌ ఫొటోలను ఇన్‌స్ట్ర్రాగాంలో పోస్ట్‌ చేసే ముందు ఈ విషయాల గురించి ఎందుకు ఆలోచించలేదు ఈ అమ్మడు అన్న అభిమానుల ప్రశ్నకు ఇలియానా వద్ద బదులు లేదట. మొత్తం మీద బాయ్‌ఫ్రెండ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్ల డించిన ఇలియానా ప్రకటనతో తన నట జీవితానికి ఎఫెక్ట్‌ అవుతుందని భావించి ఆయనతో పెళ్లిని వాయిదా వేసుకుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement