కష్టాలు ఎదురైనా సాధించేశాను: హీరోయిన్ | I am an inspiration for women, says Parineeti Chopra | Sakshi
Sakshi News home page

కష్టాలు ఎదురైనా సాధించేశాను: హీరోయిన్

May 1 2016 7:13 PM | Updated on Apr 3 2019 6:34 PM

కష్టాలు ఎదురైనా సాధించేశాను: హీరోయిన్ - Sakshi

కష్టాలు ఎదురైనా సాధించేశాను: హీరోయిన్

లావుగా ఉందంటూ ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా.

ముంబై: లావుగా ఉందంటూ ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. ఆ తర్వాత సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆమె మీద ఎన్నో విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. బికినీ వేసుకుని సినిమాల్లో దర్శనమివ్వడానికి సన్నబడేందుకు కసరత్తులు చేసిందని ఎంతో మంది ఆమె మీద వ్యాఖ్యలు చేశారు. అయినా ఆమె అనుకున్నది మాత్రం సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు ఆమె బాటలో నడుస్తున్నారట. స్వయంగా ఈ విషయాన్ని పరిణీతి వెల్లడించింది. కష్టాలు ఎదురైనా  తాను అనుకున్నది ప్లాన్ చేసినట్లు పక్కాగా జరగడంతో ఈ విషయంలో విజయం సాధించినట్లు అభిప్రాయపడింది.

గతంలో చాలా మంది మహిళలు స్థూలకాయం కారణంగా సమస్యలు ఎదుర్కొవడాన్ని గమనించాను. అయితే ప్రస్తుతం తనను కలిసిన కొందరిలో చాలా స్పష్టమైన మార్పును గమనించినట్లు పేర్కొంది. ఆమె లాగానే తాము కూడా సన్నగా అవ్వాలని అమ్మాయిలు ప్రయత్నాలు మొదలెట్టారని, ఈ విషయంపై కొందరు తనతో మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఆరోగ్యం కోసం చాలా శ్రమించిన విషయాన్ని అభిమానులతో పాటు చాలా మంది గుర్తించారని, అందుకే తనదారిలో నడుస్తున్నవారికి ధన్యావాదాలు చెప్పింది.బరువు తగ్గడానికి ఏ చిట్కాలు పాటించాలని అడుగుతుంటే చాలా గర్వంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె 'మేరీ ప్యారీ బిందు' షూటింగ్ లో బిజిబిజీగా ఉంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement