అలా అనడానికి మీకెంత ధైర్యం? | 'How Dare You?': Farhan Akhtar To BJP Spokesperson On 'Low IQ' Comment | Sakshi
Sakshi News home page

అలా అనడానికి మీకెంత ధైర్యం?

Oct 23 2017 8:40 AM | Updated on Oct 23 2017 8:40 AM

'How Dare You?': Farhan Akhtar To BJP Spokesperson On 'Low IQ' Comment

సాక్షి, ముంబై : 'భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదు. వారిని జనరల్‌ నాలెడ్జ్‌ కూడా తక్కువే' అంటూ బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ నిప్పులు చెరిగారు. 'అలా అనడానికి మీకు ఎంత ధైర్యం?' అంటూ జీవీఎల్‌ నరసింహారావును ట్వీట్‌లో ట్యాగ్‌ చేశారు. 'చిత్ర పరిశ్రమలో ఉంటున్న వ్యక్తుల గురించి జీవీఎల్‌కు ఉన్న అభిప్రాయం ఇది.. దీన్ని అందరూ తెలుసుకోవాలి' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

మెర్సల్‌ సినిమాపై చెలరేగిన వివాదం(జీఎస్టీ, డిజిటల్‌ ఇండియాపై డైలాగ్‌లు)లో ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన జీవీఎల్‌.. సినిమా వాళ్లకు బుర్ర లేదని, జనరల్‌ నాలెడ్జ్‌ లేకుండా సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement