నాగ్‌ గురించి వికీపీడియా తప్పు చెబుతోందా? | Hero Karthikeya Tweet About Nagarjuna Fitness | Sakshi
Sakshi News home page

Sep 28 2018 8:43 AM | Updated on Jul 15 2019 9:21 PM

Hero Karthikeya Tweet About Nagarjuna Fitness - Sakshi

టాలీవుడ్‌ మన్మథుడు, నిత్య యవ్వనుడిగా కనిపిస్తూ యంగ్‌ హీరోలకు అసూయపుట్టేలా చేస్తున్నాడు కింగ్‌ నాగార్జున. వయసు ఆరుపదులకు దగ్గరవుతున్నా.. ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే ఉన్నాడు నాగ్‌. గురువారం రిలీజైన దేవదాస్‌ మూవీలో దేవ పాత్రలో నాగ్‌ నటన అందరినీ మెప్పించింది. 

అయితే నాగ్‌ ఫిట్‌నెస్‌పై యంగ్‌హీరో కార్తికేయ (ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌) చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ‘వికీపీడియా తప్పు చూపిస్తోందా? ఈ మనిషికి 59 సంవత్సరాలని చూపిస్తోంది. ఆయన ఫిట్‌నెస్‌తో యంగ్‌ హీరోలకు చాలెంజ్‌ విసిరుతున్నాడు. ఏమ్‌ ఉన్నాడ్రా బాబు’ అంటూ దేవదాస్‌లోని నాగ్‌ పిక్‌ను పోస్ట్‌చేశాడు. ఆర్‌ఎక్స్‌ 100తో విజయం సాధించిన కార్తికేయ.. తదుపరి చిత్రంగా ‘హిప్పీ’ని పట్టాలెక్కిస్తున్నాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement