త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద | gunasekhar next movie Bhaktha Prahladha | Sakshi
Sakshi News home page

త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద

Aug 8 2017 3:46 PM | Updated on Sep 17 2017 5:19 PM

త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద

త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద

రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ

రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు సినిమాగా రూపొందిన భక్త ప్రహాద కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

గతంలో హిరణ్యకశ్యప పేరుతో గుణశేఖర్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయకపోయినా.. ప్రహ్లాదుడి కథతోనే సినిమా చేస్తున్నట్టుగా తెలిపాడు గుణ. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ముందు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గుణశేఖర్ అక్కడే సినిమా చేయబోతున్నట్టుగా వెల్లడించారు.

రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు.రుద్రమదేవి కన్నా భారీగా ఈ సినిమాను రూపొందిచనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement