మిస్టర్‌ చంద్రమౌళికి డేట్‌ ఫిక్స్‌ | gautham karthik Mister Chandramouli Movie Release Date Fixed | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ చంద్రమౌళికి డేట్‌ ఫిక్స్‌

May 30 2018 8:59 AM | Updated on May 30 2018 8:59 AM

gautham karthik Mister Chandramouli Movie Release Date Fixed - Sakshi

మిస్టర్‌ చంద్రమౌళి చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: కోలీవుడ్‌లో తండ్రీ కొడుకులు కలిసి హీరోలుగా నటించడం అన్నది అరుదైన విషయమే. అలా అరుదైన తండ్రీ కొడుకులుగా సీనియర్‌ నటుడు కార్తీక్, గౌతమ్‌ కార్తీక్‌ నమోదవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ చంద్రమౌళి. చిత్రంలోనూ వీరిద్దరూ తండ్రికొడుకులుగా నటించడం విశేషం. నటి రెజీనా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో ధనుంజయన్‌ నిర్మించారు. కీలక పాత్రలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్, ముఖ్యపాత్రల్లో సతీష్‌ నటించారు. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, రిచర్డ్, ఎం.నాథన్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.యూ /ఏ. సర్టిఫికెట్‌తో జూలై 6న తెరపైకి రావడానికి మిస్టర్‌ చంద్రమౌళి రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు వివరాలను తెలుపుతూ చిత్రం ప్రారంభం నుంచి పాజిటివ్‌గానే జరుగుతూ వచ్చిందన్నారు. మిస్టర్‌ చంద్రమౌళి చిత్రంలో తాము అందించిన ఎంటర్‌టెయిన్‌మెంట్, ఎమోషనల్‌ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉందన్నారు. వారి సమయాన్ని వృథా చేయదన్న గ్యారెంటీ ఇస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గౌతమ్‌ కార్తీక్, రెజీనాల రొమాన్స్‌ సన్నివేశాలు యువతను గిలిగింతలు పెట్టిస్తాయని అన్నారు. చిత్రం కలర్‌ఫుల్‌గానూ, అదే సమయంలో చాలా భావోద్రేక సన్నివేశాలతోనూ జనరంజకంగా ఉంటుం దని తెలిపారు. నటుడు గౌతమ్‌కార్తీక్, రెజీనా, సతీష్, వరలక్ష్మి వంటి వారు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారన్నారు. అలాంటి వారితో ఈ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి వారందించిన సహకారమే కారణం అని పేర్కొన్నారు. చిత్రాన్ని జూలై 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తిరు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement