పీసీ, అనుష్క బాటలో దీపికా | Deepika Padukone May Enter In Production | Sakshi
Sakshi News home page

పీసీ, అనుష్క బాటలో దీపికా

Apr 15 2018 1:55 PM | Updated on Apr 15 2018 1:55 PM

Deepika Padukone May Enter In Production - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాల తర్వాత మరో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అనుష్క శర్మ ఇప్పటికే ఎన్‌హెచ్‌ 10, ఫిలౌరి, పారి వంటి విజయవంతమైన చిత్రాలను తన బేనర్‌ క్లీన్‌స్లేట్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కించగా ప్రియాంక చోప్రా పర్పుల్‌ పెబెల్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరిట పలు ప్రాంతీయ చిత్రాలను నిర్మించారు. తాజాగా పద్మావత్‌పై ఘనవిజయం అందుకున్న దీపికా పడుకోన్‌ సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంటెంట్‌ ఆధారిత చిత్రాలను నిర్మించేందుకు త్వరలోనే ఆమె నిర్మాతగా మారనున్నారనే ప్రచారం సాగుతోంది.

గతంలోనే ఆమె పలు సందర్భాల్లో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడతానని ప్రకటించారు. అభిరుచికి తగిన చిత్రాలతో ముందుకొస్తానని, కేవలం సొమ్ముచేసుకునేందుకే ప్రొడ్యూసర్‌ కాబోనని గతంలో దీపికా పేర్కొన్నారు.ఇక ఇర్ఫాన్‌ ఖాన్‌తో కలిసి ఆమె విశాల్‌ భరద్వాజ్‌ మూవీలో నటిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది చివరిలో రణ్‌వీర్‌ సింగ్‌తో ఆమె వివాహం జరగనుందని వార్తలొచ్చాయి. 

Advertisement
 
Advertisement
Advertisement