ఆమె కథేంటి? | damyanti movie | Sakshi
Sakshi News home page

ఆమె కథేంటి?

Sep 1 2016 12:14 AM | Updated on Sep 4 2017 11:44 AM

ఆమె కథేంటి?

ఆమె కథేంటి?

బాలు, కౌశిక్, అనూష, రవళి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దమయంతి’. స్వీయ దర్శకత్వంలో నౌండ్ల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

 బాలు, కౌశిక్, అనూష, రవళి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దమయంతి’. స్వీయ దర్శకత్వంలో నౌండ్ల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే జి.కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా, మరో ఎమ్మెల్యే జి.కిశోర్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. నౌండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘దమయంతి ఎవరు? ఆమె కథ ఏంటి? అన్నది సస్పెన్స్. మూడు షెడ్యూళ్లలోనే షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ వొంటెల, కెమేరా: ఎమ్‌ఎస్ కిరణ్ కుమార్, సంగీతం: ఎస్‌ఎస్ ఆత్రేయ.
 

Advertisement
 
Advertisement
Advertisement