
ధన్‌రాజ్ చొరవతోనే చేశాను
వర్ధమాన యువనటుల్లో నవీన్‌ది ప్రత్యేక స్థానం. అనతికాలంలోనే 20కి పైగా సినిమాల్లో వైవిద్యమైన ప్రాతలు
భూదాన్‌పోచంపల్లి : వర్ధమాన యువనటుల్లో నవీన్‌ది ప్రత్యేక స్థానం. అనతికాలంలోనే 20కి పైగా సినిమాల్లో వైవిద్యమైన ప్రాతలు పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. రంగుల ప్రపంచం కోసం కలలు కని, ఎంతో కష్టపడి ఆ కలను సాకారం చేసుకున్నాడు. తనకు గాడ్‌ఫాదర్లు ఎవదూ లేరని, స్వశక్తితోనే సినీ పరిశ్రమలో పైకి వచ్చానని పేర్కొంటున్న నవీన్.. తన సినీ జీవిత విశేషాలను సాక్షికి వివరించాడు.
కుటుంబ నేపథ్యం
మాది రాజమండ్రి. నా అసలు పేరు నవీన్‌నే ని. నాన్న శేఖర్ హెల్త్ ఆఫీసర్, అమ్మ రామలక్ష్మి గృహిణి. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండేది. చిరంజీవి సినిమాలు బాగా చూసేవాడిని. సినిమా చూసి ఇంటికి వచ్చిన తరువాత ఆ హీరోల డైలాగ్స్, డ్యాన్స్, హావభావాలను అనుకరించేవాడిని.
సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డా..
తనకు గాడ్‌ఫాదర్లంటూ ఎవరూ లేరు. ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్లేవాడిని. స్టేజీ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. చివరకు ‘100% లవ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి ప్రవేశించాను.
విభిన్న పాత్రల్లో నటించే అవకాశం రావడం అదృష్టం
‘100% లవ్’ సినిమా తరువాత పిల్లజమీందార్ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ఆటోనగర్ సూర్య, రోటిన్ లవ్‌స్టోరీ, తుంగభద్ర, కుమారి 21ఎఫ్, మళ్లీమళ్లీ రానిరోజు, ఇటీవల విడుదలైన కల్యాణవైభోగమే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో తదితర సినిమాలలో తనకు విభిన్న పాత్రలలో నటించే అ వకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మనసంతా, ఆక్సిజన్, సూపర్‌గుడ్ బ్యా నర్‌లో ఓ సినిమాతో పాటు తమిళంలో ఇష్క్ సిని మాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరో ఐ దారు సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి.
ధన్‌రాజ్ చొరవతో..
పిల్ల జమీందార్ సినిమాలో నటిస్తున్నప్పుడు నటుడు ధన్‌రాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన చొరవతో జబర్ద్‌స్త్ ప్రోగ్రామ్స్ చేశాను. అందులో 20 ఎపిసోడ్స్ వరకు చేశాను. ప్రస్తుతం పూర్తిగా సినిమాల పైన దృష్టి సారించాను. అన్ని రకాల పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది.