చిన్నారి ఏం చేసింది? | Chinnari movie set to release on 25th | Sakshi
Sakshi News home page

చిన్నారి ఏం చేసింది?

Nov 13 2016 10:53 PM | Updated on Sep 4 2017 8:01 PM

చిన్నారి ఏం చేసింది?

చిన్నారి ఏం చేసింది?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చిన్నారి’.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చిన్నారి’. బేబీ యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ముఖ్య  పాత్రల్లో నటించారు. లోహిత్ దర్శకత్వంలో కేఆర్‌కే ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్‌పై కె.రవికుమార్, ఎంఎంఆర్ సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘హారర్ కథాంశంతో వైవిధ్యంగా తీసిన చిత్రమిది.

తల్లి, కూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. చాలా బాగుందంటూ పలువురు అభినందించారు. సూపర్ హిట్ కన్నడ మూవీ ‘రంగి తరంగి’కు సంగీతం అందించిన అజినీష్ లోక్‌నాథ్ మంచి పాటలిచ్చారు. నేపథ్య సంగీతం, కెమెరామేన్ వేణు టేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement