రిటైర్‌ అయిపోయా | Cameron Diaz confirms retirement from acting career | Sakshi
Sakshi News home page

రిటైర్‌ అయిపోయా

Apr 9 2018 12:57 AM | Updated on Apr 9 2018 12:57 AM

Cameron Diaz confirms retirement from acting career - Sakshi

కెమరూన్‌ డియోజ్‌

హాలీవుడ్‌లో హీరోయిన్ల కెరీర్‌ వాళ్ల వయసును బట్టి ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఇరవైల్లో, ముప్పైల్లో, నలభైల్లో ఇలా తమ స్థాయిని, ఎంచుకునే పాత్రల స్థాయినీ పెంచుకుంటూ వెళుతుంటారు అక్కడి హీరోయిన్లు. ఇప్పుడు నలభైల్లో అలా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ నడిపిస్తున్న వారెందరో! వీరందరితో సమానంగా నిలబడగల కెమరూన్‌ డియోజ్‌ మాత్రం సినిమాలకు దాదాపుగా బై బై చెప్పేసింది. 45 ఏళ్ల కెమరూన్, 2014లో చేసిన ‘ఆనీ’ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు.

ప్రస్తుతానికి ఆమె పెళ్లి చేసుకొని, కుటుంబానికే పరిమితం అయిపోయింది. ‘‘ఈమధ్య నేనేం సినిమాలు చేయడం లేదు. అస్సలంటే అస్సలు ఏం చేయడం లేదు. ఆల్మోస్ట్‌ రిటైర్‌ అయిపోయా’’ అందామె, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. మై బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వెడ్డింగ్, చార్లెస్‌ ఏంజెల్స్, ది హాలిడే లాంటి సినిమాలతో డియోజ్‌ సూపర్‌ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక భవిష్యత్‌లో కూడా సినిమాల్లోకి వచ్చే ఆలోచనైతే చేయడం లేదని చెప్తోంది డియోజ్‌! ఆమె అభిమానులకు ఇది చేదువార్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement