breaking news
Cameron Daiz
-
రిటైర్ అయిపోయా
హాలీవుడ్లో హీరోయిన్ల కెరీర్ వాళ్ల వయసును బట్టి ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఇరవైల్లో, ముప్పైల్లో, నలభైల్లో ఇలా తమ స్థాయిని, ఎంచుకునే పాత్రల స్థాయినీ పెంచుకుంటూ వెళుతుంటారు అక్కడి హీరోయిన్లు. ఇప్పుడు నలభైల్లో అలా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ నడిపిస్తున్న వారెందరో! వీరందరితో సమానంగా నిలబడగల కెమరూన్ డియోజ్ మాత్రం సినిమాలకు దాదాపుగా బై బై చెప్పేసింది. 45 ఏళ్ల కెమరూన్, 2014లో చేసిన ‘ఆనీ’ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతానికి ఆమె పెళ్లి చేసుకొని, కుటుంబానికే పరిమితం అయిపోయింది. ‘‘ఈమధ్య నేనేం సినిమాలు చేయడం లేదు. అస్సలంటే అస్సలు ఏం చేయడం లేదు. ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయా’’ అందామె, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, చార్లెస్ ఏంజెల్స్, ది హాలిడే లాంటి సినిమాలతో డియోజ్ సూపర్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక భవిష్యత్‌లో కూడా సినిమాల్లోకి వచ్చే ఆలోచనైతే చేయడం లేదని చెప్తోంది డియోజ్! ఆమె అభిమానులకు ఇది చేదువార్తే! -
ఆగస్టు 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఆండీ రాడిక్ (మాజీ టెన్నిస్ క్రీడాకారుడు), కామెరాన్ దియాజ్ (హాలీవుడ్ నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది రవి సంఖ్యకావడం వల్ల అధికారుల సహకారం తో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. ఇంటిలో పాతవస్తువుల స్థానంలో ఖరీదైన ఫర్నీచర్‌ను అమర్చుకుంటారు. పుట్టిన తేదీ 30 అంటే 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, ఆదివారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, అనాథలను ఆదుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. - డాక్టర్ మహమ్మద్ దావూద్


