మెగాస్టార్కు స్ఫూర్తి ఎవరో తెలుసా..? | Big B gets inspiration from fans' love | Sakshi
Sakshi News home page

మెగాస్టార్కు స్ఫూర్తి ఎవరో తెలుసా..?

May 2 2016 3:02 PM | Updated on Sep 3 2017 11:16 PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు.

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ఓ దశలో బిగ్ పనిఅయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయినా పడిలేచిన కెరటంలా దిగ్విజయంగా దూసుకెళ్తున్నారు. విజయాలు, పరాజయాలు ఏవి ఎదురైనా అమితాబ్కు స్ఫూర్తి కలిగిస్తూ ముందుకు నడిపించేది ఎవరంటే..? కోట్లాది అభిమానులట. 73 ఏళ్ల బిగ్ బీ స్వయంగా ఈ విషయం చెప్పారు.

'అభిమానులు చూపే ప్రేమ, అనురాగాన్ని నిర్వచించేందుకు పదాలు చాలవు. వాళ్లు నిరంతరం అండగా ఉంటూ మద్దతు ఇస్తున్నారు. నాపై  ఎంతో విశ్వాసం చూపుతున్నారు. దీన్ని ఎంతో గొప్పగా భావిస్తున్నా. అభిమానుల ప్రేమ నాలో స్ఫూర్తి కలిగిస్తోంది. ప్రతి నిమిషం బలాన్ని ఇస్తోంది. ఈ ప్రేమ స్వచ్ఛమైనది. ఎప్పుడూ కలుషితం కాదు. ఇదేదో సాదాసీదా కృత్రిమమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. వెలకట్టలేనిది. అందరికీ ధన్యవాదాలు' అని అమితాబ్ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement