ఏడేళ్లల్లో నాలుగు అవతార్‌లు! | Avatar 2 Won't Release in 2018 | Sakshi
Sakshi News home page

ఏడేళ్లల్లో నాలుగు అవతార్‌లు!

Apr 30 2017 12:12 AM | Updated on Sep 5 2017 9:59 AM

ఏడేళ్లల్లో నాలుగు అవతార్‌లు!

ఏడేళ్లల్లో నాలుగు అవతార్‌లు!

ఇలాంటి అద్భుతావతారాన్ని చూడలేదు. బహు బాగుంది. భవిష్యత్తులో ఇలాంటి సినిమా వస్తుందో? లేదో?

‘‘ఇలాంటి అద్భుతావతారాన్ని చూడలేదు. బహు బాగుంది. భవిష్యత్తులో ఇలాంటి సినిమా వస్తుందో? లేదో? ఒకవేళ వచ్చినా అది జేమ్స్‌ కామెరూనే తీయాలి’’ అని ‘అవతార్‌’ సినిమా చూసినవాళ్లందరూ అన్నారు. 2009లో వచ్చిన ఈ హాలీవుడ్‌ అద్భుతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఈ సినిమాకి దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సీక్వెల్స్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే.

ఒకటి కాదు... ఏకంగా నాలుగు సీక్వెల్స్‌ తెరకెక్కించడానికి ఆయన ఎప్పుడో సన్నాహాలు మొదలుపెట్టారు. 2018లో ‘అవతార్‌–2’ని రిలీజ్‌ చేస్తామన్నారు. అయితే రెండేళ్లకు విడుదల వాయిదా వేశారు. మారిన తేదీలను ప్రకటించారు. 2020 డిసెంబరు 18న ‘అవతార్‌–2’ని విడుదల చేస్తామని కామెరూన్‌ పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌ 17న మరో సీక్వెల్‌ను, 2024 డిసెంబర్‌ 20న ఇంకో సీక్వెల్‌ను, 2025 డిసెంబరు 19న ఫైనల్‌ సీక్వెల్‌ను విడుదల చేస్తామని కామెరూన్‌ తెలిపారు.

 ‘‘ఈ సీక్వెల్స్‌కు బెస్ట్‌ టీమ్‌ను తీసుకున్నాను. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మా అందరి జర్నీ కొన్నేళ్లు కొనసాగుతుంది’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ‘అవతార్‌’ సీక్వెల్స్‌ విడుదల తేదీలన్నీ క్రిస్మస్‌ పండగకు దగ్గరల్లో ఉండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement