ఏంజిల్ అనుకుంటే డేంజర్ ఎదురైంది! | Angel Telugu Movie Opening | Sakshi
Sakshi News home page

ఏంజిల్ అనుకుంటే డేంజర్ ఎదురైంది!

Aug 10 2016 11:29 PM | Updated on Sep 4 2017 8:43 AM

ఏంజిల్ అనుకుంటే డేంజర్ ఎదురైంది!

ఏంజిల్ అనుకుంటే డేంజర్ ఎదురైంది!

ఈ జీవితం చాలా చిన్నది. అందుకే త్వరగా సంపాదించేసి, హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు ఆ కుర్రాడు.

ఈ జీవితం చాలా చిన్నది. అందుకే త్వరగా సంపాదించేసి, హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు ఆ కుర్రాడు. అతని స్నేహితుడు కూడా అలాంటోడే. వీళ్లిద్దరికీ భూమ్మీద సంతోషాన్నంతటినీ అనుభవించాలనుకునే ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. జీవితం జాలీగా వెళ్తుందనుకునే సమయంలో స్నేహితులిద్దరూ ఓ ప్రమాదంలో పడతారు. ఆ ప్రమాదం ఏంటో తెలుసా? ఆ అమ్మాయే.
 
 అసలు ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయితో ప్రమాదం ఏంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ ‘ఏంజిల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు. ‘బాహుబలి’ పళని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పెద్ద కుమారుడు భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత‘ఠాగూర్’ మధు కెమేరా స్విచాన్ చేయగా, హీరో సాయిధరమ్ తేజ్ క్లాప్ ఇచ్చారు.
 
  పళని గౌరవ దర్శకత్వం వహించారు. ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ‘‘నాగ అన్వేష్ ఎటువంటి పాత్రనైనా చేయగలడనే విధంగా ఉంటుందీ చిత్రం. హీరో స్నేహితుడిగా సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్‌కి ముందే భీమ్స్ అన్ని పాటల రికార్డింగ్ పూర్తి చేశాడు. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్‌కి మూడు నెలల టైమ్ పడుతుంది’’ అన్నారు. సుమన్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: గుణ, సహ నిర్మాత: యోగీశ్వర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement